News

కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర:రాంరెడ్డి


ఖమ్మం జిల్లాలో ఈనెల 8వతేదీన  కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర జరగనుందని రాంరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పరామర్శించనున్నారని తెలిపారు. అలాగే రైతుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలన్నారు. అంతేగాక ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.